అప్రమత్తంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా వ్యవహరించాలి

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

మునుగోడు : సర్‌ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను బీఎల్‌ఓలు క్షుణ్ణంగా పరిశీలించి, అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌ శ్రీదేవసేన సూచించారు. మునుగోడు ప్రాథమిక పాఠశాలలోని 171 పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. బీఎల్‌ఓ పద్మతో ఆమె మాట్లాడి ఓటరు నమోదు, దరఖాస్తుల పరిశీలన, నోటీసుల జారీ, ధ్రువీకరణ పత్రాల పరిశీలన తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా తయారీలో నింబధనలను పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement