పెద్దవూర : మండల రైతులు నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సేవలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ డీడీఎం వినయ్‌కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. పెద్దవూరలో డీసీసీబీ నూతనబ్రాంచ్‌ను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. నాబార్డ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, సహకార రంగాన్ని బలోపేతం చేసి రైతులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే పెద్దవూరలో ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో మండల రైతులు రుణాల కోసం హాలియా వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. రైతు కుటుంబాల నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఎలాంటి ఇన్‌కంట్యాక్స్ రిటర్న్‌లు లేకపోయినా.. వ్యవసాయ భూమి ఆధారంగా ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాలియా ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ పబ్బు అంజమ్మ యాదగిరి, జనరల్ మేనేజర్ నర్మద, సర్పంచ్ వెంకటయ్య, బ్రాంచ్ మేనేజర్ మిరియాల శ్రీనివాస్, సీఈఓ వెంకట్‌రెడ్డి, రంజిత్‌కుమార్, సైదులు, మనోహర్ ఉన్నారు.


