దేవరకొండ మున్సిపాలిటీలో పేరుకుపోతున్న నల్లా బిల్లులు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీలో నల్లా బకాయిలు భారీగా పేరుకుపోయాయి. సకాలంలో బిల్లులు వసూలు కాకపోవడంతో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు, నల్లా కనెక్షన్లు తొలగించేందుకు చర్యలు వేగవంతం చేసింది. పట్టణ పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 6,165 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గాను రూ.3.85 కోట్ల డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.12 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.3.73 కోట్ల బకాయిలు రాబట్టాల్సి ఉంది. పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు, భవన నిర్మాణాలు పెరిగినప్పటికీ.. నల్లా బిల్లుల చెల్లింపులో యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు తెలిపారు.


