– జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
నోటీసులు అందుకున్న ఓటర్ల సమస్యల పరిష్కారంలోనూ నల్లగొండ జిల్లాను ముందుంచుతాం. పెండింగ్ నోటీసులను వేగంగా పరిష్కరించడంతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఓటర్లకు సంబంధించిన తప్పిదాలను సరిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రాజకీయ పార్టీల వారిని సమన్వయ పరుచుకుంటూ వారి ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా విచారణకు హజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటికి రెండుసార్లు సమాచారం ఇచ్చి వచ్చేలా కృషి చేస్తున్నాం.


