నేటి నుంచి రైస్‌ మిల్లుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైస్‌ మిల్లుల బంద్‌

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

నల్లగొండ : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద రా రైస్‌కు బదులు బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని, బాయిల్డ్‌ రైస్‌ సరఫరాకు సరిపడా రేక్‌లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ల సాధన కోసం రైస్‌ మిల్లర్లు సమ్మెబాట పట్టారు. ఈ నెల 11వ తేదీ నుంచి రైస్‌ మిల్లులను బంద్‌ చేసి సమ్మెకు పోవాలని నిర్ణయించారు. తనిఖీల పేరుతో మిల్లర్లను ఒత్తిడి గురిచేస్తున్న తీరు, మిల్లుల విషయంలో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మిల్లులను బంద్‌ చేయాలని రైస్‌ మిల్లరర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement