అప్పు ఎగ్గొట్టి.. ఫెయిల్‌ చేస్తానని బెదిరింపు | - | Sakshi
Sakshi News home page

అప్పు ఎగ్గొట్టి.. ఫెయిల్‌ చేస్తానని బెదిరింపు

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

డబ్బుల విషయం నా దృష్టికి రాలేదు

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో వసూళ్ల దందా కొనసాగుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన అధ్యాపకులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న విషయం తాజాగా కలకలం రేపుతోంది. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలోని బీటెక్‌ మూడో సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని వద్ద అదే డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకురాలు తన వ్యక్తిగత అవసరం కోసం రూ.30 వేలు బదులుగా తీసుకున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అవసరానికి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని సదరు విద్యార్థిని అధ్యాపకురాలిని కోరింది. డబ్బులు అడిగితే నిన్ను సబ్జెక్టులో ఫెయిల్‌ చేస్తానని అధ్యాపకురాలు విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడడంతో యూనివర్సిటీలో పెద్ద పంచాయితీ జరిగి విషయం కాస్త బయటికి పొక్కింది. అధ్యాపకురాలు, విద్యార్థిని మధ్య వాట్సప్‌ చాటింగ్‌లో కూడా విద్యార్థిని అధ్యాపకురాలిని గట్టిగానే ప్రశ్నించడం ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు కళాశాలలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం యూనివర్సిటీ అధ్యాపకుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ పంచాయితీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దగ్గరికి చేరినట్లు సమాచారం.

గతంలో పరీక్ష ఫీజు పేరిట రూ.5 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టు అధ్యాపకుడు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి కొందరు అధ్యాపకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధ్యాపకులు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కాకుండా తాము చూసుకుంటామని వసూళ్ల దందా నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై యూనివర్సిటీ పెద్దలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు పరీక్ష ఫీజు కోసం వసూలు చేసిన రూ.5 లక్షలతో రెండు నెలల పాటు ఉడాయించిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. సదరు అధ్యాపకుడు చేసిన ఘనకార్యంపై యూనివర్సిటీ పెద్ద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కనీసం సస్పెండ్‌ చేయడం గానీ, పోలీస్‌ కేసు పెట్టడం లాంటి చర్యలు లేకపోవడంతో డబ్బులు వసూల్‌ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా యూనివర్సిటీ పెద్దలు స్పందించి యూనివర్సిటీలో జరుగుతున్న డబ్బుల వసూళ్ల దందాపై దృష్టి పెట్టిన అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

విద్యార్థిని నుంచి అధ్యాపకురాలు డబ్బులు తీసుకున్న విషయం నా దృష్టికి రాలేదు. విద్యార్థిని, అధ్యాపకురాలి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని విచారిస్తాం.

– హరీష్‌కుమార్‌,

ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

ఎంజీ యూనివర్సిటీలో ఓ అధ్యాపకురాలి వక్రబుద్ధి

ఫ ఇంజనీరింగ్‌ విద్యార్థిని నుంచి రూ.30 వేలు బదులు పేరిట వసూలు

ఫ ఇరువురి మధ్య వాదోపవాదాలు

ఫ వీసీ వద్దకు చేరిన డబ్బుల పంచాయితీ

ఫ గతంలోనూ పరీక్ష ఫీజులతో

ఉడాయించిన కాంట్రాక్టు అధ్యాపకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement