నల్లగొండ : చేయూత పింఛన్ల పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి విడతగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులతో కలిపి ఐదు విభాగాల వారికి చేయూత పింఛన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15 వరకు గడువు విధించగా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30,330 దరఖాస్తులు అందాయి. ఈనెల 25లోగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇంటింటికీ వెళ్లి..
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు ఇప్పటికే డీవీఓలను నియమించి, మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో డీవీఓలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పరిశీలనకు అధికారులు ప్రత్యేకంగా శ్రీచేయూత మొబైల్ వెరిఫికేషన్ యాప్‌శ్రీను అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తుదారుల వివరాల పరిశీలన పూర్తయిన వెంటనే యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా అధికారులు పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలను చేపడుతున్నారు.
ముగిసిన ఖేలో ఇండియా ఖోఖో పోటీలు
కనగల్ : కనగల్ ఎక్స్ రోడ్‌లోని స్ఫూర్తి స్కూల్‌లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఖోఖో పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. 22 జట్లు పాల్గొనగా మొదటి స్థానాన్ని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే జూనియర్ కళాశాల దామరచర్ల జట్టు, రెండవ స్థానాన్ని మహాత్మా జ్యోతిరావు ఫూలే హైస్కూల్ నల్లగొండ, మూడో స్థానాన్ని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల దామరచర్ల, నాలుగో స్థానాన్ని కేజీబీవీ చింతపల్లి జట్లు చేజిక్కించుకున్నాయి. తొలుత పోటీలను కనగల్ సర్పంచ్ నర్సింగ్ మురళీధర్‌గౌడ్ ప్రారంభించగా పాఠశాల కరస్పాండెంట్ నక్కల రమేష్, డైరెక్టర్ అలివేలు జ్యోతి ప్రజ్వలన చేశారు. గెలుపొందిన జట్లకు మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ థామాషాయ, ఉప సర్పంచ్ మండలి చంద్రయ్య, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఫ 25లోగా అర్హుల గుర్తించేందుకు కసరత్తు ప్రారంభం
ఫ ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 30,330
ఫ దరఖాస్తుల స్వీకరణకు 15 వరకు గడువు


