19న చిన్నమాదారం సర్పంచ్‌ ఎన్నికపై ఓట్ల రీకౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

19న చిన్నమాదారం సర్పంచ్‌ ఎన్నికపై ఓట్ల రీకౌంటింగ్‌

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

కనగల్‌ : కనగల్‌ మండలం చిన్నమాదారం గ్రామ సర్పంచ్‌ ఎన్నికకు సంబంధించిన ఓట్లను మరోసారి లెక్కించేందుకు నల్లగొండ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు నల్లగొండలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో రీకౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను ప్రస్తుతం కోర్టు ఆధీనంలో భద్రపరిచారు. రీకౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కోర్టు ఎంపిక చేసిన న్యాయ ప్రతినిధిని అడ్వకేట్‌ కమిషనర్‌గా నియమించింది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పిండి భాగ్యమ్మపై కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికంటి సుజాత 11 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఓట్లను తిరిగి లెక్కించాల ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరగనున్న రీకౌంటింగ్‌పై కనగల్‌ మండలంలో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement