నల్లగొండ : వీబీజీ రాంజీ పథకం కింద గ్రామాల అభివృద్ధికి తోడ్పడే పనులు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వీబీజీ రాంజీ పనులపై చర్చించి మాట్లాడారు. పనిచేసే కూలీల సంఖ్య పెంచాలన్నారు. గ్రామసభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే జూన్ వరకు వర్షాలు వచ్చే అవకాశం లేనందున నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎఫ్‌ఓ రాజశేఖర్ పాల్గొన్నారు.


