వాడపల్లి మీదుగా రవాణా
పీడీయాక్ట్ నమోదు చేస్తాం
బియ్యం కల్తీచేసి..
మిర్యాలగూడ : పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో దొడ్డు బియ్యాన్ని మిల్లులకు తరలించి సన్నగా మార్చి తరలించేవారు. ప్రస్తుతం సన్నబియ్యం రావడంతో నేరుగా నాణ్యమైన సన్నరకం బియ్యంలో కల్తీ చేస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.12 నుంచి రూ.15 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్న చిరు వ్యాపారులు వాటిని ఆటోలు, డీసీఎంలు, లారీల్లో పట్టణాలకు తరలించి రేషన్ బియ్యం దందా చేసే దళారులకు కిలోకు రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని దళారులు కల్తీ చేసి జిల్లా సరిహద్దులు దాటించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే తప్పా పెద్ద మొత్తంలో తరలివెళ్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టుబడుతున్నా మారని తీరు..
● వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా గత ఏడాదిలో 36.04 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోని 36 మందిపై 17 కేసులు నమోదుచేసి 17 వాహనాలను సీజ్ చేశారు.
● ఇటీవల ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకోగా ఆ లారీ మిర్యాలగూడ మండలం గూడూరు శివారులోని ఓ రైస్ మిల్లుకు సరఫరా చేస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో సదరు రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
● వారం రోజుల క్రితం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని శ్రీ మారుతి ట్రేడర్స్ శ్రీరామ బిన్నీ రైస్ మిల్ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాదీనం చేసుకోని ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరకుండానే..
రేషన్ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్దకు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఆ పాయింట్‌కు సరఫరా కాకుండానే నేరుగా కొన్ని రైస్ మిల్లులకు తరలించి అక్కడి నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని తెలుస్తోంది. డీలర్లు తమ కార్డుదారులకు అవసరమైన బియ్యం తీసుకోకుండా కేవలం నామమాత్రంగానే డీడీలు కట్టి మిగిలిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచే నేరుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రా ప్రాంతంలో కోళ్లదాణా, బీర్ల తయారీకి రేషన్ బియ్యాన్ని వాడుతున్నారని తెలుస్తోంది.
గ్రామాల్లో నిల్వ చేసి రాత్రివేళ తరలింపు..
కేతేపల్లి, నకిరేకల్ మండలాల సరిహద్దు గ్రామాల నుంచి బీమారం– సూర్యాపేట, పాములపాడు మీదుగా మిర్యాలగూడకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని కొంతమంది ఏజెంట్ల ద్వారా ఆయా గ్రామాల్లో నిల్వ చేసి రాత్రి సమయాల్లో వాహనాల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. దందా చేసే వారు రేషన్ డీలర్లతో కుమ్మకై ్క వారి వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా కొనుగోలు చేసి రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మిర్యాలగూడ, హాలియా, నల్లగొండ ప్రాంతాల్లో ఉండే రైస్‌మిల్లులు బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఫ పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
ఫ లబ్ధిదారుల నుంచి సేకరించి.. మిల్లులో కల్తీ చేస్తున్న దళారులు
ఫ నాణ్యమైన బియ్యంలో కలిపి విక్రయాలు
ఫ వాడపల్లి సరిహద్దు మీదుగా భారీగా తరలింపు
ఫ పీడీయాక్ట్ నమోదు చేస్తున్నా ఆగని అక్రమ రవాణా
సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి చెక్‌పోస్టులో తనిఖీలు నామమాత్రంగా ఉండడంతో దామరచర్లకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోగల ఓ రైస్ మిల్లులో త్రిపురారం మండలం నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి అక్కడి నుంచి నేరుగా డీసీఎంలలో తరలిస్తున్నారు. మిర్యాలగూడలోని హౌజింగ్‌బోర్డు, పాత బస్టాండ్, బంగారుగడ్డ, షాబునగర్ తదితర కేంద్రాల్లో బియ్యాన్ని నిల్వ ఉంచి వీలున్నప్పుడల్లా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు.
రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా, దందాకు సహకరించినా క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అక్రమ దందాపై సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు పారితో షికాన్ని అందిస్తాం. డివిజన్ వ్యాప్తంగా ఆయా ప్రధాన గ్రామాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తాం.
– రవి, డీఎస్పీ, మిర్యాలగూడ


