నల్లగొండ : వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. 2026 –27 వానాకాలం సీజన్ ధాన్యం సేకరణపై ఆయన తన ఛాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో నిర్దేశించిన 356 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెప్టెంబర్ 25 నాటికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం గ్రేడ్ –ఏ ధాన్యానికి రూ.2461, కామన్ రకానికి రూ.2441 మద్దతు ధర ప్రకటించిందని, సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీసీఓ మైకేల్ బోస్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆర్‌ఎం కె. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
నల్లగొండ : జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఆయన మాట్లాడారు. నాలుగు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి భూమిని గుర్తించామని తెలిపారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లోని వైజాగ్‌కాలనీకి సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారని, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, రాక్ కై ్లంబింగ్‌కు అవకాశం ఉందన్నారు. దేవరకొండ కోటలో సౌకర్యాలు మెరుగుపరిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈనెల 26న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, టూరిజం అధికారి మహ్మద్ అక్బర్ అలీ పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలి
వినాయక నవరాత్రుల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం నల్లగొండలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ పరిరక్షణ, మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


