నకిరేకల్ : ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నకిరేకల్‌లో నిర్వహించే ప్రజావికాస సభకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీఎం సభకు లక్ష మంది వరకు జనం హజరయ్యే అవకాశం ఉండటంతో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వర్ష సూచన నేపథ్యంలో సభ నిర్వహించే మినీస్టేడియం మైదానంలో జర్మనీ రెయిన్ ప్రూఫ్ టెంట్లును ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా సీఎం, మంత్రులతో కూడిన ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లతో పట్టణ ప్రధాన రోడ్లను అలంకరించారు.
రూ.32 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం
నకిరేకల్‌లోని వీవీఎం ఉద్దీపన స్కూల్(వాసవి కళాశాల)ఆవరణలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సీఎం నేరుగా 100 పడకల వైద్యశాల వద్దకు చేరుకుని ప్రారంభించనున్నారు. సభావేదిక స్థలంలోనే రూ.100 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ భవన సముదాయాలు, వివిద ప్రభుత్వ కార్యాలయల భవనాలు, ఇతర అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
● సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ వీవీఎం స్కూల్‌లోని హెలిపాడ్‌కు చేరుకుంటారు.
● 4.05 గంటలకు ప్రత్యేక కాన్వాయ్ ద్వారా నకిరేకల్ 100 పడకల వైద్యశాలకు చేరుకొని ప్రారంభింస్తారు.
● 4.25 గంటలకు మినీ స్టేడియంలోని సభావేదిక వద్దకు చేరుకుంటారు.
● 4.30 గంటలకు సభావేదిక వద్ద వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.
● 5.40 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరుతారు.


