నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలు చేసిన తర్వాతే ముఖ్యమంత్రి నకిరేకల్‌కు రావాలని.. లేకుంటే ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలో భాగంగా శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వంటా–వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల పెంపు, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున రెడ్డి, మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీంద్రరావు, అభిమన్యు శ్రీనివాస్, వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్, కరీం పాషా, బొజ్జ వెంకటయ్య, తుమ్మల లింగస్వామి, జమాల్ ఖాద్రీ, బోనగిరి దేవేందర్, ఐతగోని యాదయ్య, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, సత్తయ్య, సింగం లక్ష్మి, మామిడి పద్మ, మందడి లిఖిత, మారగోని భవాని గణేశ్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కొందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, గోపగాని స్వాతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


