నరసింహకు జాతీయ ఉత్తమ సర్పంచ్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

నరసింహకు జాతీయ ఉత్తమ సర్పంచ్‌ అవార్డు

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి సర్పంచ్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లపంగి నరసింహ జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్‌ –2026 అవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఈ అవార్డు వ్యక్తిగతంగా తనకు వచ్చిన గౌరవం మాత్రమే కాదని, రాంరెడ్డిపల్లి ప్రజల విశ్వాసానికి, గ్రామాభివృద్ధికి, ప్రజాసేవకు దక్కిన గుర్తింపు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement