రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భజలాలు అడిగంటాయి. ప్రాజెక్టులకు నీరురాక, విద్యుత్ ఉత్పత్తికూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న పంటలవైపు రైతులను మళ్లించడానికి వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా నెల 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తోంది.
33 రైతు వేదికల్లో విత్తన మేళా..
జిల్లాలో 140 రైతు వేదికలు ఉన్నప్పటికీ.. 33 మండలాల్లోని 33 రైతు వేదికల్లో విత్తన మేళాల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో టీఎస్ సీడ్స్ కార్పొరేషన్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, ప్రైవేట్ విత్తన కంపెనీల డీలర్లు భాగస్వాములు కానున్నారు. వీరు కంది, పెసర, మినుములు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న మొదలైన పంటల విత్తనాలను రైతులకు విక్రయించనున్నారు.
ఫ నేటి నుంచి 29 వరకు
33 రైతు వేదికల్లో విత్తన మేళా
ఫ ఆరుతడి పంటల
విత్తనాలు విక్రయం
రైతు వేదికలలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని రకాల కంపెనీలు, తెలంగాణ, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యామ్నాయ ఆరుతడి విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. రైతులు వాటనికి కొనుగోలు చేసి సాగు చేసుకోవాలి.
– ఉల్లోజు వినోద్‌కుమార్,
జిల్లా వ్యవసాయాధికారి


