రామగిరి(నల్లగొండ) : తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో బి.వీరన్న ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించగా, కడారు సురేందర్‌రెడ్డి ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా కె.ప్రవీణ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగు కోటయ్య, కోశాధికారి ఇ.రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నూతన జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బెల్లి యాదయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారామ్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ఉన్నత విద్యా రంగంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అరవింద, వెంకటకృష్ణ, ఈ.రాంరెడ్డి, సిహెచ్.అజయ్ కుమార్, కె.ప్రవీణ్‌రెడ్డి, హరిత, ఎం.వెంకటరెడ్డి, కె.శివరాణి, గంజి శ్రీనివాస్, శ్రీనివాసచారి పాల్గొన్నారు.


