కేతేపల్లి : కేతేపల్లి మండలంలో కేతేపల్లి, కొర్లపహాడ్, చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో సర్వీసు రోడ్ల వెంట బస్‌షెల్టర్లు నిర్మించారు. హైవే వెళ్లే ఇతర వాహనాలకు ఆటంకం కలుగకుండా బస్‌షెల్టర్ల ముందు బస్‌బేలు సైతం ఏర్పాటు చేశారు. కానీ, డ్రైవర్లు హైవేపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో బస్సుల కోసం జనం రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ నిలబడుతున్నారు. ఇక పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు గంటల తరబడి ఎండలో ఎండుతూ, వర్షానికి తడుస్తూ రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బస్‌షెల్టర్లు నిరుపయోగంగా ఉండటంతో రైతులు ధాన్యం ఆరబోసేందుకు కల్లాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల మాసం విక్రయదారులు, యాచకులకు అడ్డాగా మారాయి.


