నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ విజయవిహార్‌లో జాతీయస్థాయి డయాబెటీస్ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రీసెర్చ్ సొసైటీ ఫర్‌ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా(ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక డయాబెటీస్ సదస్సు (టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ–2026) సాగర్‌లోని టీఎస్‌టీడీసీ రిసార్ట్స్ విజయవిహార్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఏప్రిల్ 12వరకు కొనసాగుతుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వైద్యుల శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ సదస్సు ప్రదాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా వైద్యులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనున్నారని పేర్కొన్నారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి హాజరుకానున్నారు.


