జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫిబ్రవరి కంటే మార్చి నెలలో భూగర్భ జలాల తగ్గుదల స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ.. పలు మండలాల్లో మాత్రం ఈనెల, వచ్చే నెలలో భారీగా భూగర్భ జలాలు భారీగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. జిల్లాలో 33 మండలాల్లో ఫిబ్రవరి నెలతో పోల్చితే మార్చి నెలలో దాదాపు అంతటా భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక 8 మండలాల్లో మీటరు కంటే ఎక్కువగా లోతులోకి భూగర్భ జలాలు వెళ్లాయి. అందులో అత్యధికంగా కొండమల్లేపల్లిలో వేగంగా భూగర్భ జలాలు పడిపోయాయి. అక్కడ ఫిబ్రవరి నెలలో 3.28 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. మార్చి నెలలో 7.75 మీటర్లకు పడిపోయాయి.
కొండమల్లేపల్లి
మిర్యాలగూడ
వేములపల్లి
నార్కట్‌పల్లి
కట్టంగూరు
గుడిపల్లి
గుండ్లపల్లి
చింతపల్లి
0.55
1.36
1.4
2.83
5.87
3.28
3.22
4.44
7.87
7.75
7.91
9.43
7.00
7.12
11.00
ఈ సంవత్సరంలో పలు మండలాల్లో భూగర్భ జలాల తగ్గుదల ఇలా (మీటర్లలో..)
7.99
మార్చి


