నకిరేకల్ : నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో నివాసముంటున్న కనుకుంట్ల సుశీల(70) గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలు సేకరించారు. సోమవారం సుశీల మృతదేహాన్ని కూడా ఆమె భర్త శంకర్‌రెడ్డి, కుమారులు సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి అంగీకారంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్, క్లబ్ ప్రతినిధులు రాంమోహన్‌నావు, ఎర్ర శంభులింగారెడ్డి, సూర్యచంద్రరావు, పైళ్ల శశిధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సుశీల భౌతికకాయానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్, స్థానిక కౌన్సిలర్ కందాల భిక్షంరెడ్డి, సీపీఎం నేతలు వంటేపాక వెంకటేశ్వర్లు, బొజ్జ చిన వెంకులు, వంటేపాక కృష్ణ నివాళులర్పించారు.


