బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ పట్టణంలోని పానగల్‌ సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది బీజేపీ నాయకులపై నల్ల గొండ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేశారని టూటౌన్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీంతో 8 ఏళ్లుగా బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, మిర్యాల గిరి, జంజిరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్‌, చింత యాదగిరి తదితరులపై ఈ కేసు కొనసాగింది. సోమవారం వీరందరిపై కేసును కొట్టివేస్తూ జిల్లా కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

పెన్‌పహాడ్‌ : ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చీదెళ్ల గ్రామానికి చెందిన గొబ్బి కాంతయ్య(53) ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement