ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

కోదాడ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌, డిపోను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తదనుగుణంగా సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం జానిరెడ్డి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుచరిత, డీఎం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement