40 నిమిషాల ముందే
కేంద్రాలకు చేరుకోవాలి..
నల్లగొండ : ‘పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 109 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈసారి నిమిషం నిబంధన తొలగించి 5 నిమిషాలు అలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతిస్తాం’ అని డీఈఓ భిక్షపతి తెలిపారు. శనివారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లను మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పరీక్షలకు 19,845 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 19,845 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ విభాగంలో 19,698 విద్యార్థులు, ప్రైవేట్ 137 మంది పరీక్షలకు హాజరువుతారు. పరీక్ష పేపర్లు కూడా ఆయా సెంటర్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచాం. హైపవర్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరు ప్లఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో టీమ్‌లో రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల నుంచి ఒక్కరు చొప్పున ముగ్గురు ఉంటారు. సీ సెంటర్లలో 13 సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 1,032 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. 109 మంది సెంటర్ సూపర్‌వైజర్లు, 109 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాం.
రోజూ 3 గంటల పాటు పరీక్ష..
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. పిజికల్ సైన్స్ పేపర్–1 9.30 నుంచి 11 గంటల వరకు పిజికల్ సైన్స్ పేపర్–2 (బయాలజికల్ సైన్స్) 11 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. 5 నిమిసాలు గ్రేస్ పిరియడ్ కింద ఎవరైనా ఆలస్యంగా వస్తే అనుమతిస్తాం.
క్లాక్‌రూమ్ ఏర్పాటు..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ప్రతి పరీక్ష కేంద్రం బయట క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి విలువైన వస్తువులు ఉంటే అక్కడ భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశాం. అక్కడ వారికి వస్తువులు ఇస్తే టోకెన్ ఇస్తారు. పరీక్ష పూర్తయిన తర్వాత వారి వస్తువులు తిరిగి తీసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై డీఈఓ, ఎంఈఓ, ఎస్‌హెచ్‌ఓల ఫోన్ నంబర్లు ఉంటాయి.
మాల్ ప్రాక్టీస్‌కు సహకరిస్తే సర్వీస్
నుంచి సిబ్బంది రిమూవ్..
పరీక్షల్లో ఎవరైనా సిబ్బంది మాల్ ప్రాక్టీస్‌కు సహకరిస్తే శాఖపరమైన చర్యలతో పాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక పేపర్లను తిరిగి పోస్టాపీస్‌లకు తరలిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.
విద్యార్థులు పరీక్ష సమయానికి 40 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. సీఎస్ రూమ్‌లో సీసీ కెమెరాల సమక్షంలోనే పేపర్లను ఓపెన్ చేసి అదే రోజు పేపరా కాదా అని చెక్‌చేసిన తర్వాతే పేపర్లు పంపిణీ చేస్తాం. విద్యార్థులు ప్యాడ్, హాల్‌టికెట్, పెన్నులు మాత్రమే తెచ్చుకోవాలి. ఒకవేళ వాటర్ బాటిల్ తెచ్చినా గేటు బయట ఉంచాల్సిందే. సిబ్బంది తప్పకుండా ఐడీ కార్డులు పెట్టుకువస్తారు.
ఫ టెన్త్ పరీక్షలకు 109 కేంద్రాలు ఏర్పాటు చేశాం
ఫ ప్రశ్నపత్రాలను పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచాం
ఫ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి
ఫ డీఈఓ భిక్షపతి


