రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పెన్నా మోహన్‌శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దివ్య జ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని మంగళవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ధూప దీప నైవేద్య అర్చకులకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మానవాళికి మంచి జరగాలని ఆకాంక్షించారు. మేయర్ చైతన్య మాట్లాడుతూ బ్రాహ్మణులందరూ సమాజ హితం కోసం పూజలు చేయాలని కోరారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకులకు సమన్యాయం జరిగేందుకు అర్చక ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందని అన్నారు. అర్చకులకు పే స్కేల్స్ రావడానికి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కె.భాస్కర్, కారంపూడి నరసింహాచార్యులు, దివ్య రామన చక్రవర్తులు, బాలసుబ్రహ్మణ్యం, డివిఆర్ శర్మ, కొండోజు నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


