నకిరేకల్ : గ్రామాలు, మున్సిపాలిటీల్లో సమస్యలు లేకుండా తీర్చదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికల కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక నియోజకర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాల్సిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాను చదివి వినిపించాలని అధికారులకు సూచించామని తెలిపారు.
ఉగాది ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే 87126 70266 నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
సమన్వయంతో పని చేయాలి :వేముల వీరేశం, ఎమ్మెల్యే
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. నకిరేకల్‌లో 100 పడకల వైద్యశాల భవనాన్ని తర్వలో ప్రారంభిస్తామన్నారు. రోడ్డు భద్రత దృష్ట్యా నియోజకవర్గంలో సీసీ కెమరాల ఏర్పాటుకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, డీసీహెచ్ మాతృనాయక్, డీపీఓ శంకర్‌నాయక్, హసింగ్ పీడీ రాజ్‌కుమార్, మార్కెట్ చైర్ పర్సన్ గుత్తా మంజుల, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్లు చౌగోని రజిత, పందిరి గీత, మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్ ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఫ నకిరేకల్‌లో నియోజకవర్గ స్థాయి
సన్నాహక సమావేశం


