కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ

Mar 7 2026 7:31 AM | Updated on Mar 7 2026 7:31 AM

నల్లగొండ : విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని డైట్‌ కాలేజీలో కౌమార విద్యపై ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సమన్వయ అధికారి వి.సుధాకర్‌ మాట్లాడుతూ బాలబాలికలు కౌమార దశనుంచి హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఐవీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమగ్రశిక్షా జిల్లా కోఆర్డినేటర్‌ రామచంద్రయ్య మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సంక్రమిత వ్యాధుల నివారణకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించడంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. అనంతరం కౌమార విద్యకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు. ఆయా పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌ ఎ.జానయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement