నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పురోగతి సాధిస్తున్నారని తెలిపారు. సమాజంలో భిన్నపాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడుతున్న మహిళలను ఎంత అభినందించినా తక్కువే అన్నారు. దేశంలో ఎంతో మంది నారీమణుల స్ఫూర్తి గాథలను విద్యార్థులు ప్రేరణగా స్వీకరించి క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం మహిళ విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ, పాటల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పద్మజ, కోట కరుణాకర్, వసంత, రేఖ, శ్రీలక్ష్మి, లక్ష్మీప్రభ, అధ్యాపకులు పాల్గొన్నారు.


