వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు
మునగాల: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా విద్యాధికారి(డీఐఈఓ) భానునాయక్ పేరొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ విద్యార్థులు మంగళవారం మునగాల మండలం ఇందిరానగర్ వద్ద గల సోలార్ పవర్‌ప్లాంటును తిలకించారు. డీఐఈఓ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న విషయాలకంటే క్షేత్రస్థాయిలో నేర్చుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు ఆన్‌జాబ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, ప్లాంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.


