పెరటి కోళ్లకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
కోదాడరూరల్ : పెరటి కోళ్ల పెంపకందారులు క్రమం తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెరటి కోళ్లకు వ్యాధి నిరోధక టీకా వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోదాడలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకుకు హైదరాబాద్‌కు చెందిన చప్పిడి జయకాంతమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కుమారుడు డాక్టర్ చప్పిడి సుధాకర్ పెరటి కోళ్ల టీకాల కోసం రూ.20వేల విలువైన మందులు అందజేయడం అభినందనీయమన్నారు. స్థానిక పశువైద్యశాలలో ప్రతి మంగళవారం కోళ్లకు ఈ ఉచిత టీకాలు వేయనున్నట్లు తెలిపారు. టీకాలు వేయించడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి కోళ్లను కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వీఎస్‌శర్మ, ఖమ్మం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల రూపకుమార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సిరిపురపు సురేంద్ర, డాక్టర్ మమత, డాక్టర్ సుమతి, సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, హరికృష్ణ ఉన్నారు.


