అతిథి గృహాలన్నీ ఫుల్
నాగార్జునసాగర్: నూతన సంవత్సరం వేడుకల కోసం నాగార్జునసాగర్‌లోని అతిథి గృహాలన్నింటిని ఔత్సాహికులు బుక్ చేసుకున్నారు. గత 15రోజులక్రితమే విజయవిహార్‌లోని గదులన్నీ ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయి. స్థానిక సిద్దార్థ హోటల్ గదులతోపాటు ప్రైవేట్ హోటల్స్, సాగర్ డ్యాం అవతలి వైపు నూతనంగా 40గదులతో నిర్మించిన మాతా సరోవర్ రిసార్ట్స్ బుధవారం పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.
ఇతరులకు ఇబ్బంది కలగనీయొద్దు
ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సాగర్ ిసీఐ శ్రీనునాయక్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ద్విచక్రవాహనాలపై త్రిబుల్ డ్రైవింగ్ చేసినా వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతిలేని హోటల్స్‌లో వినియోగదారులకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సాగర్‌లో డీజేకు అనుమతులు లేవని పేర్కొన్నారు.
● నూతన సంవత్సరం నేపథ్యంలో గదులన్నీ బుకింగ్ చేసుకున్న ఔత్సాహికులు


