ప్రజలకు కావాల్సింది.. ఫ్యూచర్ గ్రామాలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రజలకు కావాల్సింది ఫ్యూచర్ సిటీలు కాదని.. ఫ్యూచర్ గ్రామాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైజింగ్ తెలంగాణ పేరుతో ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో గ్రామీణ పాలనకు నేరుగా 40శాతం నిధులు విడుదల చేస్తున్న ఏకై క రాష్ట్ర కేరళ అని, కేరళను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌నాయక్, కోటిరెడ్డి, ఉన్నం వెంకటేశ్వర్లు, నాగయ్య, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


