
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 2,88,545 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం వద్ద 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా మొత్తం 2,77,316 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి, కాల్వలకు 11,229 క్యూసెక్కులు మొత్తం 2,88,545 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదవుతోంది. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు (305.8030టీఎంసీలు)గా ఉంది.
డిండి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టులోకి 10,100 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్ శాఖా ఏఈ పరమేష్ తెలిపారు. అలుగు మీద నుంచి దుముకుతున్న జలాలు చూపరులకు కనువింధు చేస్తున్నాయి.
మత్తడి
దుంకుతున్న డిండి

సాగర్‌కు కొనసాగుతున్న వరద