అన్ని హంగులతో కలెక్టరేట్ నిర్మాణం
నల్లగొండ : సకల సౌకర్యాలు, హంగులతో నల్లగొండ కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. నల్లగొండ పాత కలెక్టరేట్ వెనుక వెపున నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మంత్రి ఛాంబర్ ఉండేలా చూడాలని సూచించారు. పాత కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. కొత్త భవనంలో మీటింగ్ హాల్‌ను ఫాల్ సీలింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్లతో నిర్మించాలన్నారు. భవన నిర్మాణ పనులు, నాణ్యతపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఈ భవనం పూర్తయితే బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. అనంతరం బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్‌సాబ్ దర్గాపైకి నిర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. ఇప్పటివరకు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆర్‌అండ్‌బీ అధికారులు మంత్రికి వివరించారు. ఆయన వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


