
డిసెంబర్‌లోగా ట్యాంకుల నిర్మాణం పూర్తిచేయాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాకు చేపట్టిన ట్యాంకు నిర్మాణ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ మున్సిపల్ సమావేశ మందిరంలో తాగునీరు, రోడ్లు, మురుగుకాల్వలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద రూ.56.75 కోట్లతో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెంబర్‌లోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. రూ.109 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై ప్రతి మంగళవారం తాను సమీక్షిస్తానని తెలిపారు. అంతకుముందు మంత్రి మున్సిపాలిటీలోని ఆయా విభాగాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డీఈలు కార్తీక్, అశోక్, శ్రీధర్‌రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, అసింబాబా, ఏసీపీ కృష్ణవేణి పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి