
కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన
నార్కట్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే దుర్మార్గపు పాలన తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మంగళవారం నార్కట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్దకు రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చిరుమర్తి రైతుల సమస్యలను తెలుసుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక మంత్రి యూరియా కొరత లేదని చెబుతుంటే, మరో మంత్రి నిల్వలు లేవని అంటున్నారని మండిపడ్డారు. రైతులు ఇన్ని ఇబ్బందులు ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ హయాలో యూరియా కొరత రాలేదని.. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు రైతులకు యూరియా సరఫరా చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇప్పటికై నా అధికారులు, మంత్రులు స్పందించి యూరియా తెప్పించి రైతులను అదుకోవాలన్నారు. ఆయన వెంట యానాల అశోక్‌రెడ్డి, దుబ్బాక శ్రీదర్, కర్నాటి ఉపేందర్ ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య