
14 క్రస్ట్‌గేట్ల నుంచి వరద
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరుసగా గేట్లను మూసివేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్‌గేట్లకు గాను 12 క్రస్‌గేట్లను మూసి వేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,61,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువ కృష్ణానదిలోకి స్పిల్‌వే మీదుగా 1,07,338 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,739 క్యూసెక్కులు మొత్తం 1,41,077 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.