
నల్లగొండ టౌన్ : ఫొటోగ్రఫీ పోటీల్లో జాతీయస్థాయిలో భజరంగ్ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన సాక్షి సీనియర్ ఫొటో గ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్‌ను మంగళవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా సుంకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భజరంగ్‌ను సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, అబ్బగోని రమేష్‌గౌడ్, గాదె వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.