
ఏ పంట.. ఎంత విస్తీర్ణం
అక్టోబరు చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టల నమోదు పూర్తవుతుంది. నమోదు చేసిన వివరాలను ఆయా గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఏఈఓలు ప్రదర్శిస్తారు. అందులో తప్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నవంబరు 13వ తేదీ వరకు పక్కాగా జాబితా తయారవుతుంది.
– శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ
నల్లగొండ అగ్రికల్చర్ : పంటల సాగు లెక్క పక్కాగా ఉండేందుకు ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లాలో సాగు చేసిన పంటల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఆన్‌లైన్‌లో పంటల నమోదును ప్రారంభించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 7 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు పంటల న మోదు ప్రక్రియను చేపట్టనున్నారు. రైతు పేరు, సర్వే నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం, పోన్ నంబర్‌తో పాటు ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో తెలుసుకుని ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పంటల నమోదు కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. తప్పులకు ఆస్కారం లేకుండా పక్కాగా నమోదు చేస్తున్నారు. దీంతో జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్న సమాచారం పక్కాగా తేలనుంది.
9,90,502 ఎకరాల్లో సాగు..
ప్రస్తుత వానాకాలంలో 11,00,500 ఎకరాల్లో వివిధ పంటల సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటి వరకు 9,90,502 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా పత్తి 5,64,585 ఎకరాల్లో సాగు చేయగా వరి 4,44,932 ఎకరాల్లో వేశారు. వీటన్నింటిని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయనున్నారు.
ఫ పంటల నమోదు ప్రక్రియ ప్రారంభం
ఫ క్షేత్రస్థాయిలో పర్యటించి
వివరాలను ఆన్‌లైన్‌లో
అప్‌లోడ్ చేస్తున్న ఏఈఓలు

ఏ పంట.. ఎంత విస్తీర్ణం