సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి పెద్దపీట

Aug 17 2025 4:30 PM | Updated on Aug 17 2025 4:30 PM

సంక్ష

సంక్షేమానికి పెద్దపీట

99123 62784 ఫొటోలు పంపాల్సిన వాట్సప్‌ నంబర్‌ : వైటీపీఎస్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి

న్యూస్‌రీల్‌

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

99123 62784

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఎర్రకోట ఉత్సవాల్లో కోతులారం రైతు దంపతులు

మునుగోడు : ఢిల్లీ ఎర్రకోటలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన రైతు జాజుల బుచ్చిరాములు, సైదమ్మ దంపతులు పాల్గొన్నారు. బచ్చిరాములుకు 10 పదెకరాల భూమి ఉండగా.. అందులోని 8 ఎకరాల్లో కలబంధ సాగు చేస్తున్నాడు. ఔషధ రంగంలో ఉపయోగించే కలబంధను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీతో కేంద్ర ఆయుష్‌ విభాగం ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు రైతు రామ్మూర్తి దంపతులు హాజరయ్యారు.

లీగల్‌ అడ్వయిజర్‌గా గోవర్ధన్‌

నల్లగొండ టౌన్‌ : బీసీ సంక్షేమ సంఘం జిల్లా లీగల్‌ అడ్వయిజర్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్డ్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌, న్యాయవాది గుంటోజు గోవర్ధన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్ధన్‌ నియామకంపై సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్‌ముదిరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు.

సాగర్‌లో ట్రాఫిక్‌ జాం

నాగార్జునసాగర్‌ : సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పర్యాటకులు వచ్చిన కార్లు, బైక్‌లు, మినీ బస్సులను నదీ తీరం వెంట సాగర్‌ నుంచి మాచర్ల వెళ్లే కొత్త వంతెన సమీపంలో రోడ్డు నిలిపుతున్నారు. దీంతో పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అప్రమత్తమైన ట్రాఫిక్‌ క్లీయర్‌ చేసి వాహనాలను పంపించారు.

హెడ్‌కానిస్టేబుల్‌ చేతజెండా ఆవిష్కరణ

నల్లగొండ: షీటీమ్‌ కార్యాలయంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బక్కయ్య జెండా ఆవిష్కరించారు. బక్కయ్య ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. 40 సంవత్సరాల పాటు పోలీస్‌ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా షీటీమ్స్‌ సీఐ కరుణాకర్‌ ఆయనకు జెండా ఆవిష్కరించే అవకాశాన్ని కల్పించారు. జెండా ఆవిష్కరించిన బక్కయ్య బావోద్యేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో షీటీమ్‌ ఎస్‌ఐ గౌస్‌, భరోసా ఎస్‌ఐ అంజలి, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్‌ చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌

ఇలా త్రిపాఠి, ఎస్పీ తదితరులు

నల్లగొండ అంటేనే త్యాగాలకు పుట్టిల్లు. తల్లి

దండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం ఇక్కడి ప్రజలు కల్పించారు. రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు కూర్చుంటే వీరతిలకం దిద్ది పోరు చేయి బిడ్డా అంటూ వెన్నంటే ఉన్నారు.

– స్వాతంత్య్ర వేడుకల్లో

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం సంక్షమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నల్లగొండలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నమని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే కామన్‌ పీపుల్‌కు సింబల్‌ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా కులగణన చేశామని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నాని పేర్కొన్నారు. నల్లగొండను బంగారు కొండగా మార్చాలనే సంకల్పంతో జిల్లాలో ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిదులు సమష్టిగా కృషి చేస్తున్నారన్నారు.

ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం..

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. కానీ.. ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపేయాలనే దుష్ట ప్రచారం మొదలు పెట్టాయని.. వాళ్లకు సీట్లు, ఓట్లు, కమీషన్లు తప్ప మరో అవసరం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాలకు అన్యాయం చేసిందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి రోడ్లే జీవనాడులు..

రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులు రోడ్లే అని, రోడ్లు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రమే మారుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో హ్యాం పద్ధతిలో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి 4 వరుసల రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరుసల రోడ్లు, గ్రామాలను కలిపేలా రోడ్లను బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

అన్ని పథకాలు అమలు చేస్తున్నాం

ప్రజా సంక్షేమం కోసం అనే పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడ పడుచులు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాల చొప్పున 19,526 నిర్మించాలని తలపెట్టామని.. వాటిలో 4300 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో కొత్తగా 65,276 కొత్త రేషన్‌ కార్డులను ఇచ్చామన్నారు. పాత కార్డుల్లో 82,364 మంది సభ్యులను చేర్చి.. కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2,43,175 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు.

బ్రాహ్మణ వెల్లెంల పూర్తిచేశాం

జిల్లాలో సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి బ్రాహ్మణవెల్లెంల లిఫ్ట్‌ ఇరిగేషన్‌, రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. నెల్లికల్లు లిఫ్ట్‌ కింద 24,866 ఎకరాల ఆయకట్టు పెంచడానికి పరిపాలన ఆమోదం పొందామన్నారు. కేశవాపురం, కొండ్రపోల్‌, బొత్తలపాలెం, వాడపల్లి, వీర్లపాలెం, తోపుచర్ల, దున్నపోతులగండి తదితర లిఫ్ట్‌ల కోసం నిధులు మంజూరు చేశామన్నారు. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పని చేస్తున్నామన్నారు.

జిల్లాలో లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి రూ.110 కోట్లతో 40 సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని 200 పడకలకు పెంచామని.. గంధంవారిగూడెంలో నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో భూములు కేటాయించామని.. నల్లగొండలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీస్‌శాఖ మిషన్‌ పరివర్తన్‌ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా జిల్లా సరోతముఖాభివృద్ధికి కృషి చేస్తున్న శాసన మండలి చైర్మన్‌, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రదాన న్యాయమూర్తి, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, అధికార యంత్రాగానికి ధన్యవాదాలు తెలిపారు.

నల్లగొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థుల నృత్య ప్రదర్శన

జాతీయ అవార్డు

అందుకున్న రఘునందన్‌

రామగిరి(నల్లగొండ): పొగాకు నియంత్రణకు 20 ఏళ్లుగా కృషి చేస్తున్న మాచన రఘునందన్‌ నేషనల్‌ టోబాకో కంట్రోల్‌ హీరోస్‌ 2025 అవార్డు అందుకున్నారు. పొగాకు నియంత్రణ అంతర్జాతీయ వేదిక రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ (ఆర్‌సిటిసి) ఈ అవార్డును అందజేసింది. శుక్రవారం రఘునందన్‌ వర్చువల్‌గా జరిగిన సమావేశంలో పాల్గొని అవార్డు స్వీకరించారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ పనిచేస్తూ సమాజ హితం కోసం రఘునందన్‌ పాటు పడుతున్నట్లు ఆర్‌సిటిసి ఆచార్యులు డాక్టర్‌ సోనూ గోయల్‌ కొనియాడారు.

నేత్రపర్వంగా

ఊంజల్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, వెండి జోడు సేవోత్సవం నిర్వహించారు.

నాగార్జునసాగర్‌: ఎగువ నుంచి సాగర్‌కు వరద స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా 26గేట్లను ఎత్తిన అధికారులు.. శుక్రవారం 14గేట్లకు తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. వద్ద పద్నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి 1,44,694 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయం నుంచి 14 గేట్ల నుంచి, విద్యుదుత్పాదనతో కలిపి 1,38,244 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.90 అడుగులు ఉంది.

ఫ విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం

ఫ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి తీరుతాం

ఫ హ్యామ్‌ పద్ధతిలో రోడ్లు నిర్మిస్తున్నాం

ఫ నల్లగొండను బంగారుకొండ చేసేందుకు కృషి చేస్తున్నాం

ఫ స్వాతంత్య్ర వేడుకల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో 2,33,981 మంది రైతులకు రూ.2044. 83 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 5,26,363 మంది రైతులకు రూ.716.48 కోట్లు ఇచ్చామన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నామని.. 38,539 మెట్రిక్‌ టన్నుల యూరియాపాటు 3,66,872.45 టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 2928 మందికి 5577 ఎకరాల పోడు పట్టాల పంపిణీ చేశామన్నారు.

ఫ 14 గేట్ల ద్వారా నీటి విడుదల

సంక్షేమానికి పెద్దపీట1
1/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట2
2/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట3
3/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట4
4/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట5
5/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట6
6/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట7
7/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట8
8/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట9
9/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట10
10/11

సంక్షేమానికి పెద్దపీట

సంక్షేమానికి పెద్దపీట11
11/11

సంక్షేమానికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement