
ఉప్పొంగిన డిండి
డిండి : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు దుందుబి వాగు ద్వారా మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది. శుక్రవారం సెలవు దినం కావడంతో డిండి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరింగింది. ఈ క్రమంలో ప్రాజెక్టు వద్ద ఆగి డ్యాం అలుగుపోస్తున్న అందాలను కొందరు తమ సెల్‌ఫోన్లో బందిస్తుండగా మరికొంతమంది సెల్పీ దిగారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,105 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్ ఏఈ పరమేష్ తెలిపారు.
డిండి ప్రాజెక్టు అలుగు ద్వారా దిగువకు పోతున్న వరద నీరు