
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉదయం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటిమట్టం 645 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఉదయం తెరిచిన ఆరు క్రస్టు గేట్లకు అదనంగా సాయంత్రం మరో మూడు క్రస్టు గేట్లను(మొత్తం 9 గేట్లు) రెండు అడుగుల మేర ఎత్తి 14,910 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పోతున్న వరదనీరు