
డీసీసీబీని లాభాల దిశగా నడిపిస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ని లాభాల దిశగా నడిపించడానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తమ పాలకవర్గం పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిడించినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకును వచ్చే ఆరునెలల కాలంలో మరింత బలోపేతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, సభ్యులు పాశం సంపత్‌రెడ్డి, గుడిపాటి సైదులు, కొంద సైదయ్య, ధనావత్ జయరాం, బుంటు శ్రీనివాస్, వీరస్వామి, గొల్లగూడ సొసైటీ చైర్మన్ నాగరత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.