
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
మిర్యాలగూడ అర్బన్ : దేశంలో అంతరాలు లేని సమాజస్థాపనకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామంలో నిర్వహించిన రాగిరెడ్డి వీరారెడ్డి 44వ వర్థంతిలో ఆయన మాట్లాడారు. ముందుగా సీపీఎం కార్యాలయం నుంచి రాయినిపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న వీరారెడ్డి స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జూలకంటి మాట్లాడుతూ.. భూ పంపిణీ చేయాలని రాగిరెడ్డి వీరారెడ్డి రాజీలేని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీరారెడ్డి ఉద్యమాలను తట్టుకోలేక దారుణంగా హత్య చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, పాదూరి శశిధర్‌రెడ్డి, వినోద్ నాయక్, పోలెబోయిన వరలక్ష్మి, శ్రీనివాస్, రామ్మూర్తి, ఊర్మిల, గోవర్ధని, అరుణ, వాడపల్లి రమేష్, సైదులు, గోవిందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భిక్షం తదితరులు పాల్గొన్నారు.