
సాగర్‌కు పర్యాటకుల తాకిడి
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణాష్టమి సందర్భంగా శనివారం సెలవు కావడంతో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్పిల్ వే మీదుగా కిందకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ పరవళ్లను ఫొటోలు తీసుకుంటూ, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. పర్యాటకుల వాహనాలతో లాంచీ స్టేషన్ వద్ద, ఫైలాన్ కాలనీ మూడు రోడ్ల కూడలిలో, కొత్త వంతెన సమీపంలో ట్రాఫిక్ జాం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 50 మంది, తెలంగాణ నుంచి 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు.
నాగార్జునకొండలో పర్యాటకులను
వదలివచ్చిన లాంచీ స్టేషన్ సిబ్బంది
నాగార్జునకొండ సందర్శనకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు లాంచీలో వెళ్లిన పర్యాటకులను నాగార్జునకొండలోనే వదిలి.. లాంచీ ఎక్కిన వారిని తీసుకుని లాంచీ స్టేషన్‌కు తిరిగి వచ్చింది. దీంతో 30 మంది పర్యాటకులు నాగార్జునకొండ పైనే ఉండిపోయారు. అక్కడున్న పర్యాటకులు ఫోన్లు చేయడంతో తిరిగి లాంచీ వెళ్లి రాత్రివేళ వారిని తీసుకుని వచ్చింది. లాంచీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం పర్యాటకులు అందరూ వచ్చారా లేదా అని చూసుకోకుండానే తిరిగి వస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగర్‌కు పర్యాటకుల తాకిడి

సాగర్‌కు పర్యాటకుల తాకిడి