
వాసవీ ఆలయానికి స్వర్ణ రథం
ఫ 17, 18 తేదీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు
దేవరకొండ : తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి స్వర్ణ రథాన్ని దేవరకొండ ఆర్యవైశ్య సంఘం నాయకులు సమకూర్చారు. ఈ నెల 17, 18 తేదీల్లో స్వర్ణరథం ప్రారంభోత్సవానికి దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 18న రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.