
బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం
నల్లగొండ టూటౌన్ : బీజేపీ జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి శనివారం ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మైల నరసింహ, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, బచ్చనబోయిన దేవేందర్‌యాదవ్, సజ్జల నాగిరెడ్డి, వనం నరేందర్‌రెడ్డి, పకీర్ మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, మన్‌సాల వెంకన్న నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులుగా ఇస్లావత్ బాలాజీనాయక్, రమనగోని దీపిక, ఏరుకొండ నర్సింహ, తాటిపాముల శివకృష్ణగౌడ్, ఇరిగిసెట్టి అనిత, పబ్బు వెంకటేశ్వర్లును నియమించారు. జిల్లా కోశాదికారిగా కాసాల జనార్థన్‌రెడ్డి, ఉప కోశాధికారిగా తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, కార్యాలయ కార్యదర్శిగా గోసెట్టి భద్రమ్మ, కార్యాలయ ఉప కార్యదర్శిగా మంగిలిపల్లి కృష్ణమూర్తి, ఐటీ ఇన్‌చార్జిగా కంచుగొమ్ముల వేణును నియమించారు.
వ్యవసాయ మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్ కుంభం
నల్లగొండ టౌన్ : పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
సంస్థాన్ నారాయణపురం: రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవిని, వాటిని యువత ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి యాదయ్య, నర్రి నర్సింహ, బైరి శేఖర్, రవీందర్, రమేష్ పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం