
సఖీ సెంటర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ
నల్లగొండ : సఖీ సెంటర్‌లలో 17 మంది మహిళలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ రిసోర్స్ సెంటర్ పర్ ఉమెన్, ఓల్డ్ సాలిదారిటీ సహకారంతో కుట్టు మిషన్లు అందజేశామన్నారు. బాధిత మహిళలకు పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో త్వరగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సఖీ కేంద్రానికి నెలకు సుమారు 70 కేసులు వస్తున్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కె.కృష్ణవేణి, సుమలత, సునీత, వరుణ శ్రీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.