
వరదలతో అప్రమత్తంగా ఉండాలి
మిర్యాలగూడ : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇర్కిగూడెం ఘాట్ వద్ద చేపలు పట్టేందుకు మత్స్యకారులు లోపలికి వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా నియమించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అంతకు ముందు తెలంగాణ –ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం, ఇసుక, యూరియా అక్రమంగా రవాణా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలని అఽధికారులను ఆదేశించారు. అనంతరం దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు పాము, తేలు కాటు వంటి మందులతోపాటు సీజనల్ మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ జవహర్‌లాల్, పీహెచ్‌సీ వైద్యుడు నాగేశ్వర్‌రావు ఉన్నారు.
ఫ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద
కృష్ణమ్మ ఉధృతి పరిశీలన