
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
నల్లగొండ టౌన్: బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్‌లను కల్పించే అర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద ఉన్నందున వాటినిఆమోదించడానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజీపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్‌రావులు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు కుల గణన సక్రమంగా జరగలేదని, బీసీల 42 శాతంలో ముస్లీంలకు 10 శాతం ఎలా ఇస్తారని అంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై న రాష్ట్ర బీజీపీ నాయకులు ఢిల్లీలో ధర్నాలు చేసి కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ముందుకుపోవాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ బీసీల రిజర్వేషన్‌లపై పార్లమెంట్‌లో చర్చించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లను కల్పించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్యగౌడ్ పాల్గొన్నారు.