
మహిళా పోలీసులు అన్ని విధులు నిర్వర్తించాలి
నల్లగొండ : నేరాలర నియంత్రణలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధం కావాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలు, కుటుంబం తరఫున వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. షీ లీడ్స్–నల్లగొండ బిలీవ్స్ అనే నినాదంతో నూతన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహిళా సిబ్బంది పోలీస్‌స్టేషన్ రిసెప్షన్, రికార్డు వర్క్, సీసీటీఎన్‌ఎస్, టెక్ టీమ్, కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వయిరీ చేయాలన్నారు. కోర్ట్ సమన్స్, వెహికల్ చెకింగ్, ఎస్కార్టు, ట్రాఫిక్, బందోబస్తు, మెడికల్, కోర్టు డ్యూటీలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, ఎస్‌బీ సీఐ రాము, డబ్ల్యూపీఎస్ సీఐ కరుణాకర్, ఆర్‌ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.